: సీలేరులో తెలంగాణ ఇంజినీర్లపై వివక్ష!... కేటీఆర్ భరోసాతో చెప్పా పెట్టకుండా సొంత రాష్ట్రానికి ఇంజినీర్లు!


తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం వెలుగు చూసింది. విశాఖ జిల్లా పరిధిలోని సీలేరుకు చెందిన పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న తెలంగాణ ఇంజినీర్ల పట్ల అక్కడి ఏపీ జెన్ కో అధికారులు వివక్ష చూపిస్తున్నారట. అంతేకాకుండా పరిమితి మించి పనిభారం మోపుతూ వేధింపులకు పాల్పడుతున్నారట. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ 21 మంది బాధిత ఇంజినీర్లు ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలవడం జరిగింది. విధుల నుంచి రిలీవ్ చేయాలని ఏపీ జెన్ కో అధికారులను కోరాలని కేటీఆర్ వారికి సూచించారు. ‘‘రిలీవ్ చేస్తే సరి... లేదంటే సర్వీస్ రికార్డులకు సంబంధించిన జిరాక్స్ కాపీలతో వచ్చేయండి. మన రాష్ట్రంలోనే ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేస్తాం’’ అంటూ కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. దీంతో మొన్నటి(గురువారం) నుంచి ఆ 21 మంది ఇంజినీర్లు విధులకు హాజరు కావడం లేదట. పరిస్థితిని అవగతం చేసుకున్న ఏపీ జెన్ కో ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన ఇంజినీర్లతో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News