: రోశయ్యకు జయలలిత వీడ్కోలు... కుటుంబసభ్యులతో తెలుగులో ముచ్చటించిన ముఖ్యమంత్రి
తమిళనాడు గవర్నర్ బాధ్యతల నుంచి వైదొలగిన కొణిజేటి రోశయ్యను సీఎం జయలలిత మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ సతీమణి శివలక్ష్మి, ఇతర రోశయ్య కుటుంబసభ్యులతో ఆమె తెలుగులో ముచ్చటించారు. గత ఐదు సంవత్సరాలుగా తమ ప్రభుత్వానికి సహాయ సహకారాలందించినందుకుగాను రోశయ్యకు ఆమె కృతఙ్ఞతలు తెలిపారు. రోశయ్యపై తనకెప్పుడూ గౌరవ మర్యాదలుంటాయన్నారు. ఈ సందర్భంగా రోశయ్య కుటుంబసభ్యులతో ఆమె గ్రూప్ ఫొటో దిగారు.