: ఆ ఒక్క హీరోకే మేము ఇంకా మాటలు రాయలేదు: పరుచూరి గోపాలకృష్ణ


తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోలందరికి తాము మాటలు రాశామని, అయితే, ఒకే ఒక్క హీరో పవన్ కల్యాణ్ చిత్రానికి ఇంకా మాటలు రాయలేదని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ‘సిద్ధార్థ’ చిత్రం ఆడియో వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ గారు మాతో ఒకటే చెప్పారు. బ్రదరూ... నా సినిమాకు ఏ విధంగా అయితే మాటలు రాస్తారో, అదే విధంగా మీరు పనిచేసే ప్రతి చిత్రానికీ రాయాలన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మేము అదే పద్ధతి పాటిస్తున్నాము, మేము మాటలు రాసే ప్రతి సినిమాను మా మొదటి సినిమాగా భావిస్తాము’ అని అన్నారు. బుల్లితెర హీరో సాగర్ కథానాయకుడిగా నటిస్తున్న‘సిద్ధార్థ’లో ఆయన సరసన రాగిణి నంద్వాణి, సాక్షి చౌదరి నటించారు. ఈ కార్యక్రమానికి ‘సిద్ధార్థ’ దర్శకుడు కెవి దయానంద్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తదితరులు హాజరయ్యారు. కాగా, ‘సిద్ధార్థ’ చిత్రానికి మాటలు పరుచూరి బ్రదర్స్ రాశారు.

  • Loading...

More Telugu News