: స్కైపులో మాట్లాడడం కాదు... దమ్ముంటే పోరాడు: శివాజీకి బోండా ఉమ సవాల్
ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడినంటూ బయల్దేరిన సినీ హీరో శివాజీ నోరు అదుపులో పెట్టుకోవాలని విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ హెచ్చరించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఎక్కడో విదేశాల్లో ఉండి స్కైప్ వీరుల్లా ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదని అన్నారు. ఇక్కడికి వచ్చి పోరాడాలని ఆయన సవాల్ విసిరారు. ఢిల్లీలో కష్టపడి పోరాటం చేస్తున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలను విమర్శించే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. శివాజీకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి వచ్చి పోరాడాలని ఆయన సవాలు విసిరారు. తమకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పొత్తులు ఎక్కువ కాదని, ఆ విషయాన్ని శివాజీ లాంటి వారు గుర్తించాలని ఆయన తెలిపారు.