: నయీం కేసులో గత మూడు రోజుల్లో పది మంది అరెస్టు: సిట్ చీఫ్ నాగిరెడ్డి


కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో మరో 10 మందిని అరెస్ట్ చేశామని సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నయీం కేసులో ఇప్పటివరకు 62 కేసులు నమోదు చేశామని అన్నారు. గత మూడు రోజుల్లో పది మందిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. కరీంనగర్‌ జిల్లా కోరుట్లలో ఈ కేసులో కీలకమైన అహ్మద్‌ ఖాన్‌ ను నేడు అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. నల్గొండ జిల్లా భువనగిరిలో 9 మందిని అరెస్ట్‌ చేశామని ఆయన చెప్పారు. అక్కడ అరెస్టైన వారిని పాశం శీను మనుషులుగా గుర్తించామని ఆయన తెలిపారు. వీరంతా నయీం ప్రధాన అనుచరుడు పాశం శీనుతో కలిసి కిడ్నాప్‌ లు, బలవంతపు రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News