: మళ్లీ ‘పాక్’ కాల్పుల ఉల్లంఘన.. అఖ్నూర్ సెక్టార్లో కొనసాగుతున్న కాల్పులు
సరిహద్దుల్లో పలుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ దాయాదిదేశం పాక్ మరోమారు అదే బాట పట్టింది. పాకిస్థాన్ మరోమారు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్ లోని అఖ్నూర్ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద భారత దళాలపై పాకిస్థాన్ సైనికులు ఈరోజు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో, అప్రమత్తమైన భారత సైనికులు ఎదురు కాల్పులకు దిగారు. అఖ్నూర్ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా, భారత సైనికులు ఎవరు గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు.