: పవన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ఈమేరకు ఒక ట్వీట్ చేశాడు. మన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, గతంలో నిర్వహించిన ‘సరైనోడు’ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటానికి అల్లు అర్జున్ ససేమిరా అన్నాడు. అంతేకాదు, పవన్ కల్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అంటూ తనదైన శైలిలో అన్నాడు. ఈ వ్యాఖ్యలతో పవన్, బన్నీ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమాల ద్వారా మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత ‘ఒక్క మనసు’ ఆడియో ఫంక్షన్లో తాను చేసిన వ్యాఖ్యలకు బన్నీ వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.