: తమిళనాడు గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన విద్యాసాగర్ రావు


మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు గవర్నర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, విద్యాసాగర్ రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆగస్టు 31వ తేదీన తమిళనాడు గవర్నర్ గా రోశయ్య పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో విద్యాసాగర్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News