: పవన్ కల్యాణ్ ఆలోచనా విధానమే ఆయన ‘పవర్’: రాంగోపాల్ వర్మ


‘మెగా’ ఫ్యామిలీపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయనంటూ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమధ్య పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ మాటను ఇప్పుడు పక్కన పెట్టారు. తనదైన శైలిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశారు. పవన్ కల్యాణ్ ను మించిన నిజాయతీ గల నేత యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరూ లేరన్నారు. పవన్ తీక్షణమైన ఆలోచనా విధానమే ఆయన ‘పవర్’ అని, అంకిత భావమే ఆయన స్టార్ డమ్ అంటూ ప్రశంసించారు. ఇటీవల తిరుపతి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మొత్తం స్పీచ్ చూశానని, ఆయన ఏ విషయాలపై అయితే మాట్లాడాడో, వాటిని ఆయన పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మూడు స్థాయుల్లో ఉద్యమించాలన్న ఆయన ఆలోచన కరెక్టు అన్నారు. ఉద్యమ ప్రణాళిక గురించి చాలా తెలివిగా మాట్లాడిన పవన్ కల్యాణ్ స్పీచ్ ను నోటమాటలేని వాళ్లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తిని కల్గి ఉన్న ఏపీ ప్రజలు చాలా అదృష్టవంతులంటూ పవర్ స్టార్ పై వర్మ ఆయా ట్వీట్లలో ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News