: మోదీ విజన్ లో భాగంగా స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్లు ప్రారంభించాం: రాజీవ్ ప్రతాప్ రూడీ
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రారంభించామని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. హైదరాబాదులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ డెవలెప్ మెంట్ శిక్షణా కేంద్రాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ వనరుల కోసం ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ లో భాగంగా స్కిల్ ఇండియా మిషన్ ను ప్రారంభించామని ఆయన తెలిపారు. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఆయన, అందులో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తుందని అన్నారు. ఇందుకోసం రాష్ట్రాలకు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఈ కేంద్రాల్లో యువత శిక్షణ పొంది నైపుణ్యాలు పెంచుకుని ఉద్యోగులుగా మారుతారని ఆయన ఆకాంక్షించారు.