: నేను ఆసుపత్రిలో వున్నప్పుడు పవన్ చూపిన అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయా: అల్లు శిరీష్


ఒక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనపై చూపిన అభిమానానికి తానెంతో ఆశ్చర్యపోయానని, ఆయన చాలా సెన్సిటివ్ అని యువ హీరో అల్లు శిరీష్ అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో శిరీష్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. 2007 సంవత్సరంలో తనకు యాక్సిడెంట్ అయిన సందర్భంలో తనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారన్నారు. ఆ సమయంలో తనను పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ అక్కడికి వచ్చారని, తనను ఆ పరిస్థితుల్లో చూసిన ఆయన కన్నీరు పెట్టుకున్నారన్నారు. అయితే, అప్పటికి, పవన్ కల్యాణ్ తో తనకు అంత పెద్దగా పరిచయం లేదని, అయినప్పటికీ ఎదుటి వారి బాధలను చూసి ఆయన తట్టుకోలేకపోయారని అన్నాడు. ఈ సంఘటనను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంటూ యంగ్ హీరో శిరీష్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News