: నేను 'రబ్బర్ సింగ్' అంటేనే పవన్ స్పందించారు... అభిమానులంతా థ్యాంక్స్ చెప్పారు: రోజా
తిరుపతి వేదికగా పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై నోరువిప్పి ప్రజా ప్రతినిధులపై విరుచుకుపడగా, దాని ఫలితంగా కేంద్రంలో కదలిక వచ్చిందని, పవన్ అంత ఆగ్రహంతో మాట్లాడటానికి తానే కారణమని వైకాపా ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు. ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆమె, తాను పవన్ కల్యాణ్ ను 'నువ్వు గబ్బర్ సింగ్ కాదు... రబ్బర్ సింగ్' అని విమర్శించానని గుర్తు చేశారు. తన విమర్శల కారణంగానే ఆయన హోదాపై మాట్లాడారని అన్నారు. ఇదే విషయాన్ని ఎంతో మంది పవన్ అభిమానులు తనకు ఫోన్ చేసి చెప్పారని, మీరు విమర్శించడంతోనే తమ అభిమాన హీరో ఇంతగా స్పందించారని వారు ఆనందిస్తూ, కృతజ్ఞతలు తెలిపారని, పవన్ అభిమానుల వ్యాఖ్యలతో తనకూ సంతోషం కలిగిందని అన్నారు.