: 'అమ్మా! నాన్న ఫోటోను ఫోన్లో పెట్టుకో'... అని చెప్పిన ఆద్య కోరికను వెంటనే తీర్చేసిన రేణూ దేశాయ్


పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేళ, ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు వైరల్ కాగా, పవన్ అభిమానులంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. తండ్రి పుట్టిన రోజున, తన కుమార్తె ఆద్య... "అమ్మా, ఇవాళ నాన్న పుట్టినరోజు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా నాన్న పిక్చర్ నీ ఫోన్ లో పెట్టుకోవాల్సిందే" అన్నదట. ఆ వెంటనే కుమార్తె కోరికను తీర్చాలని భావించిన రేణు, పవన్ ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టిందట. ఈ విషయాన్ని రేణు ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న పవన్ అభిమానులు, 'థ్యాంక్యూ వదినమ్మా, క్యూట్ డాటర్, నైస్, సూపర్' అంటూ కామెంట్లు వదులుతున్నారు.

  • Loading...

More Telugu News