: మార్షల్ ఆర్ట్స్ నటుడు జాకీచాన్ కు జీవిత సాఫల్య ఆస్కార్
మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, ప్రముఖ నటుడు జాకీచాన్ ను జీవిత సాఫల్య ఆస్కార్ వరించింది. ఈ విషయాన్ని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ (ఆంపాస్) సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రతి ఏటా గవర్నర్స్ అవార్డుల ప్రదానోత్సవాలను అకాడమీ నిర్వహిస్తుంది. ఈ నవంబర్ లో లాస్ ఏంజెల్స్ లో నిర్వహించనున్న 2016 గవర్నర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని జాకీచాన్ అందుకోనున్నారు. జాకీచాన్ తో పాటు డాక్యుమెంటరీ నిర్మాత ఫ్రెడరిక్ వైజ్ మాన్, బ్రిటిష్ ఫిల్మ్ ఎడిటర్ యాన్నె వి.కోట్స్, కాస్టింగ్ డైరైక్టర్ లిన్ స్టాల్ మాస్టర్ కూడా ఈ ఏడాది గవర్నర్స్ అవార్డులను అందుకోనున్నారు. కాగా, ఇప్పటివరకు 30కి పైగా మార్షల్ ఆర్ట్స్ సినిమాల్లో జాకీచాన్ నటించాడు.