: నిప్పులా బతుకుతున్నా!... నిజాయతీగా పాలిస్తున్నా!: చంద్రబాబు
ఓటుకు నోటు కేసు పునర్విచారణను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తనపై వెల్లువెత్తుతున్న విమర్శలను టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తిప్పికొట్టారు. రాయలసీమలోని కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిత్వం గురించి ప్రస్తావిస్తూ తన పాలన తీరుపైనా వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను నిప్పులా బతుకుతున్నా. అవినీతికి తావు లేకుండా... నీతి నిజాయతీతో పాలన సాగిస్తున్నా’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.