: హైదరాబాదులో రాజ్ నాథ్ సింగ్... సాదర స్వాగతం పలికిన గవర్నర్, తెలంగాణ డీజీపీ
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదు చేరుకున్నారు. నేటి ఉదయం ఢిల్లీలో ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సాదర స్వాగతం పలికారు. హైదరాబాదు పర్యటనలో భాగంగా నగర శివారు ప్రాంతం శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమీని సందర్శించనున్నారు.