: పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీటి తరలింపు అసాధ్యం!... బహిరంగ చర్చకు సిద్ధమన్న ఉండవల్లి!


పట్టిసీమ పేరిట పశ్చిమగోదావరి జిల్లా పట్టిసం వద్ద పోలవరం ప్రాజెక్టు సమీపంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా దేశంలోనే నదుల అనుసంధానానికి తొలిసారిగా శ్రీకారం చుట్టిన ఘనత తమదేనని టీడీపీ ప్రభుత్వం బల్లగుద్ది మరీ చెప్పుకుంటోంది. అయితే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ అవాస్తవమని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదిస్తున్నారు. రాజమహేంద్రవరంలో కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టిపీమ ద్వారా 80 టీఎంసీల నీటి తరలింపు అసాధ్యమని చెప్పారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు కూడా తాను సిద్ధమేనని ఆయన సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News