: మీడియాతో భూమన మాట్లాడుతుంటే వచ్చి నోటీసులిచ్చిన సీఐడీ


తిరుపతి ప్రెస్ క్లబ్ లో వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు అందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్న వేళ, అక్కడికి వచ్చిన సీఐడీ బృందం, మీడియా ముందే నోటీసులు ఇచ్చి ఎల్లుండి విచారణకు రావాలని చెప్పడం గమనార్హం. తునిలో జరిగిన విధ్వంసం కేసులో మీపై ఆరోపణలు వచ్చాయని, నోటీసులు ఇవ్వాలని వారం రోజులుగా మీ కోసం చూస్తున్నామని, అయితే ఎక్కడా అందుబాటులో లేరని ఈ సందర్భంగా సీఐడీ అధికారి ఒకరు భూమనతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు మీడియా సమావేశం జరగనుందని తెలుసుకునే వచ్చామని తెలిపారు.

  • Loading...

More Telugu News