: లాంచ్ ప్యాడ్ పై పేలిపోయిన రాకెట్!... అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రమాదం!


అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగామిగా రాణిస్తున్న అమెరికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రేపు ప్రయోగించేందుకు సిద్ధం చేసిన ఓ రాకెట్... లాంచ్ ప్యాడ్ పైనే పేలిపోయింది. అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కెన్నడీ స్పేస్ సెంటర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్పేస్ ఎక్స్ పేరిట తయారు చేసిన ఈ రాకెట్ ను ఓ ప్రైవేటు సంస్థ నింగిలోకి ప్రయోగించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. రేపటి ప్రయోగానికి ఏర్పాట్లన్నీ పూర్తి కాగా... అందులో భాగంగా ట్రయల్ చేస్తున్న సమయంలో స్పేస్ ఎక్స్ రాకెట్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ శబ్దానికి సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు మీడియా ఛానెళ్లలో వైరల్ మారాయి.

  • Loading...

More Telugu News