: 'ఆ గొంతు బాబుదే' అన్న ఫోరెన్సిక్ నివేదికతో సుప్రీంకోర్టుకెళ్తా: ఆళ్ల
ఓటుకు నోటు కేసులో విచారణపై స్టే విధించిన హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కోర్టు స్టే విధించిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ కేసులో వెలుగులోకి వచ్చిన ఆడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబునాయుడిదేనని నిరూపించే ఫోరెన్సిక్ నివేదికలను సుప్రీంకోర్టుకు అందిస్తామని ఆయన అన్నారు. కేసులో తనకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే చంద్రబాబు విచారణ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.