: కొనసాగుతున్న నయీమ్ అనుచరుల అరెస్టులు!... కుషాయిగూడలో ఇద్దరి అరెస్ట్!
పోలీసులకే పెను సవాల్ గా మారిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ను తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఎట్టకేలకు మట్టుబెట్టేశారు. అయితే ఆ తర్వాతే పోలీసులకు అసలు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు పోలీసు అధికారులతో పాటు బడా రాజకీయవేత్తలతోనూ నయీమ్ కు సంబంధాలున్నాయని వెల్లువెత్తుతున్న ఆరోపణల్లో వాస్తవమెంత అన్న విషయాన్ని తేల్చేందుకు తెలంగాణ సర్కారు ఏకంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి నేతృత్వంలోని సిట్... నయీమ్ అనుచరుల కోసం జల్లెడ పడుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు... నేటి ఉదయం హైదరాబాదు మహా నగరంలోని కుషాయిగూడలో నయీమ్ అనుచరులు శ్రీనివాస్, లక్ష్మణ్ లను అరెస్ట్ చేశారు.