: రాత్రి పూట అన్ లిమిటెడ్ 4జీతో రోజుకు, వారానికి... జియో మరో మూడు టారిఫ్ ప్లాన్లు


దేశవ్యాప్తంగా 1 జీబీ డేటాను రూ. 50కే అందిస్తూ సంచలన ప్రకటన వెలువరించిన రిలయన్స్ జియో, ఒకరోజు, వారానికి డేటా కావాలని కోరుకునే వారి కోసం మరో మూడు డేటా ప్యాక్ లనూ ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 19కి 'ఎక్స్ ఎక్స్ ఎస్' పేరిట ఒక రోజుకు డేటాను ఇవ్వనుంది. ఇందులో 100 ఎంబీ డేటాతో పాటు రాత్రి పూట అపరిమిత 4జీ, ఉచిత కాలింగ్, జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్, వైఫై ద్వారా 200 ఎంబీ, అపరిమిత ఎస్ఎంఎస్ లను పంపే సదుపాయం లభిస్తుంది. ఇక 'ఎక్స్ ఎస్' పేరిట ఉన్న మరో ప్యాక్ లో రూ. 129కి వారం రోజుల పాటు 0.75 జీబీ డేటా, రాత్రిపూట అన్ లిమిటెడ్ 4జీ, ఉచిత కాలింగ్, ఎస్ఎంఎస్ లు వైఫై ద్వారా 1.5 జీబీలను అందిస్తుంది. 'ఎస్' పేరిట మరో ప్యాక్ లో రూ. 299కి 21 రోజులు చెల్లుబాటయ్యేలా 2 జీబీ డేటా, వైఫై ద్వారా 4 జీబీ డేటాను వాడుకోవచ్చు. ఈ ప్యాక్ లో కూడా అన్ లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు ఉన్నాయి. ఈ మూడు ప్లాన్లలో ఏది తీసుకున్నా కాలపరిమితి ముగిసే వరకూ జియో యాప్స్ అన్నీ ఉచితమని రిలయన్స్ పేర్కొంది.

  • Loading...

More Telugu News