: జగన్ బెయిల్ పై నేడు సుప్రీం విచారణ
అక్రమాస్తుల కేసులో 2012, మే 27న అరెస్టయిన కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో నేడు విచారణకు రానుంది. బెయిల్ కోసం ఇప్పటికే ఐదుసార్లు సుప్రీంను ఆశ్రయించిన ఆయనకు నిరాశే ఎదురయింది. అయినా మళ్లీ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం జగన్ హైదరాబాద్ చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే.