: పెషావర్ క్రిస్టియన్ కాలనీపై ఉగ్రవాదుల దాడి!


పాకిస్థాన్ లోని పెషావర్ నగర పరిధిలో ఉన్న ఓ క్రిస్టియన్ కాలనీపై కొద్దిసేపటి క్రితం ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఓ యువకుడు మరణించాడు. తెల్లవారుఝామున ఈ ఘటన జరుగగా, విషయం తెలుసుకున్న భద్రతాదళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని, ఇంకా ఎంత మంది ముష్కరులు మిగిలి ఉన్నారన్న విషయం తెలియరాలేదని పాక్ దినపత్రిక 'డాన్' వెల్లడించింది. ఉగ్రదాడిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News