: తిరుమలలో ‘రిలయన్స్’ అధినేత!... కొడుకుతో కలిసి వెంకన్నను దర్శించుకున్న ముఖేశ్ అంబానీ!
మొబైల్ ఫోన్ వినియోగదారులకు తీపి కబురు అందించిన మరుక్షణమే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నిన్న ముంబైలో ఫ్లైటెక్కి నేరుగా తిరుమల వెంకన్న సన్నిధికి చేరుకున్నారు. నిన్న రాత్రి తిరుమలలోనే బస చేసిన ఆయన కొద్దిసేపటి క్రితం ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. కొడుకు అనంత్ అంబానీతో కలిసి తిరుమల వచ్చిన ముఖేశ్ కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. నేటి ఉదయం ప్రారంభ సమయంలోనే స్వామి వారి దర్శనం చేసుకున్న ఆయన... స్వామి వారికి జరిగిన అభిషేక సేవలో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత ముఖేశ్ కు టీటీడీ అధికారులు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.