: రేపు సార్వత్రిక సమ్మె.. బ్యాంక్, రవాణా సేవలు బంద్
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు 11 కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రేపు బ్యాంకులు, రవాణా సేవలు నిలిచిపోనున్నాయి. పలు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించడంతో పలు బ్యాంకులు మూతపడనున్నాయి. కాగా, ఈ సమ్మెకు ఆటో సంఘాల ఐకాస సైతం మద్దతు తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సేవలు నిలిచిపోనున్నాయి. కార్మిక చట్టాలను సవరించాలని, కార్మికులకు ఈఎస్ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని, కనీసవేతనం రూ.18 వేలు ఇవ్వాలన్న పలు డిమాండ్లతో కార్మిక సంఘాలు ఈ సమ్మె చేపడుతున్నాయి.