: రాచకొండ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలి: కోదండరాం
ప్రజాభీష్టం మేరకే తెలంగాణలో నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. రాచకొండ గిరిజన భూగోస అధ్యయన యాత్రలో భాగంగా రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులోని గిరిజన భూములను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాచకొండ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలని అన్నారు. తండాల ప్రజలు నాలుగు తరాలుగా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి వారి పక్షాన నిలిచి, వారి హక్కులను పరిరక్షించాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించి గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు.