: పాక్ జట్టుకి గుడ్ న్యూస్... నిబంధనల విషయంలో పీసీబీని ఒప్పించిన కోచ్!
గతంలో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ పాకిస్థాన్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ ఆటగాళ్లపై పీసీబీ ఆంక్షలు విధించింది. విదేశీ పర్యటనల్లో ఉండగా 24 గంటల నిఘా కొనసాగుతుందని తెలిపింది. టెస్టు మ్యాచ్ సందర్భంలో రాత్రి 10 గంటలలోపు హోటల్ రూంలకు చేరాలని, అదే వన్డేల సమయంలో రాత్రి 11 గంటల లోపు హోటల్ గదికి చేరాలనే నిబంధన ఉంది. దీంతో వారి స్వేచ్ఛకు ఆటంకం కలిగింది. ఇలాంటి నిబంధనల వల్ల ఆటగాళ్ల స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, ఇలాంటి నిబంధనలు వారిలోని ప్రతిభకు ప్రతిబంధకంగా మారతాయని పాక్ కోచ్ అర్ధర్ పీసీబీని ఒప్పించారు. దీంతో వారిపై పీసీబీ నిబంధనలు సడలించింది. బయటకు వెళ్తే... జట్టు మేనేజ్ మెంట్ కు సమాచారం ఇవ్వాలని, వారిపై నిఘా మాత్రం కొనసాగుతుందని పీసీబీ తెలిపింది.