: సుజనా గారూ... పెళ్లి తప్ప అన్నీ చేస్తాను అన్నట్టుంది మీ వరస!!: చలసాని శ్రీనివాస్


కేంద్ర మంత్రి సుజనా చౌదరి బీజేపీ నేతా? లేక ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారా? అని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా సాధన సమాఖ్య నేత చలసాని శ్రీనివాస్ సందేహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సుజనా చౌదరి ప్రెస్ మీట్ లో ఫక్తు బీజేపీ నేతలా మాట్లాడారని ఆరోపించారు. ఆయన చెబుతున్న ప్రతిపాదన 'పెళ్లి చేసుకోను కానీ, అన్నీ చేస్తాను' అన్నట్టుందని ఆయన ఎద్దేవా చేశారు. రేండేళ్లుగా రాష్ట్ర ప్రజలంతా బలంగా ఉద్యమం చేస్తూ, ప్రత్యేకహోదా కావాలని కోరుకుంటుంటే టీడీపీ నేతలు క్షణానికొక ప్రకటన చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రత్యేకహోదా ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించకపోతే... ప్రధాని ఆంధ్రప్రదేశ్ ఉద్ధరణ పధకాన్ని ప్రవేశపెట్టి, దానికి చట్టబద్ధత కల్పించి, రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన సూచించారు. ఇలా చేయడం అసాధ్యమని వారే చెబుతారు కనుక, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా రాదు అని ప్రజల్లోకి వచ్చి నేరుగా చెప్పాలని ఆయన సూచించారు. రైల్వే జోన్ ఎన్నికల ముందు ప్రకటిస్తారని, దాని వెనుక రాజకీయ క్రీడ దాగుందని అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News