: సెహ్వాగ్ కు సవాల్ విసిరిన బ్రిటిష్ జర్నలిస్టు పీర్స్ మోర్గాన్


భారత్ లో 123 కోట్ల జనాభా ఉంటే.. రియో ఒలింపిక్స్ లో కేవలం రెండు పతకాలే సాధించి, ఆపై సంబరాలు కూడా చేసుకుంటారా? అంటూ బ్రిటిష్ జర్నలిస్ట్ పీర్స్ మోర్గాన్ చేసిన విపరీత ట్వీట్ కు భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సరైన కౌంటర్ ఇచ్చిన విషయం విదితమే. ఈ విషయం మరవక ముందే పీర్స్ మోర్గాన్ తాజాగా సెహ్వాగ్ కు మరో ట్వీట్ చేశాడు. ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణపతకం సాధించే లోపు, ప్రపంచ వరల్డ్ కప్ ను ఇంగ్గాండ్ దేశం సాధిస్తుందని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా, అవసరమైతే తాను లక్ష రూపాయల పందెం కాస్తానని, అందుకు సిద్ధమేనా? అంటూ సెహ్వాగ్ కు మోర్గాన్ సవాల్ విసిరాడు. దీనికి స్పందించిన సెహ్వాగ్.. కొంతమందిని దురదృష్టం అదే పనిగా వెంటాడుతూ ఉంటుందని, వాళ్లు ఎంత ప్రయత్నించినా లాభం లేదంటూ సమాధానమిచ్చాడు.

  • Loading...

More Telugu News