: పోలవరానికి 90:10 కింద నిధులిస్తామంటున్నారు: సుజనా చౌదరి
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంలో స్పష్టత వచ్చిందని కేంద్రమంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'పోలవరానికి మొదట 70:30 కింద నిధులు ఇస్తామన్నారన్నారు. ప్రత్యేక హోదా ప్రకారమైతే 90:10 కింద నిధులు రావాలి. ఈ విషయమై మేం ఒత్తిడి చేశాం' అన్నారు. దీంతో, పోలవరానికి 90:10 కింద నిధులు ఇస్తామంటున్నారని చెప్పారు. ‘పోలవరం’ నిర్మాణం కేంద్రం చేపడితే ఆలస్యమవుతుందని చెప్పి ఆ బాధ్యతలు రాష్ట్రమే తీసుకుంటుందన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారమే పోలవరానికి నిధులిచ్చేందుకు అంగీకరించారన్నారు. ‘చేస్తాం, చూస్తామంటే అంగీకరించం.. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఒప్పుకుని తీరాల్సిందే’ అని సుజనా చౌదరి చెప్పారు.