: రేపటి నుంచి విదేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన వియత్నాంలో పర్యటిస్తారు. ఆ తరువాత నాలుగు, ఐదవ తేదీల్లో చైనాలో పర్యటిస్తారు. వియత్నాంలో ద్వైపాక్షిక అంశాలపై ఆయన ఆ దేశ మంత్రులు, అధికారులతో చర్చించన్నారు. చైనాలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఉగ్రవాదం అంశాలపై నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సులో మోదీ పాల్గొంటారు. అనంతరం ఐదవ తేదీన చైనా అధ్యక్షుడితో మోదీ భేటీ అవుతారు. అదే రోజున మధ్యాహ్నం మోదీ లావోస్ బయలుదేరుతారు. ఆ దేశంలో భారత్-ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సు జరగనుంది. అందులో పాల్గొన్న అనంతరం ప్రధాని భారత్‌కు బయలుదేరతారు.