: హోదా, ప్యాకేజీలకు సంబంధించి పై స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి: మంత్రి కామినేని
హోదా, ప్యాకేజీలకు సంబంధించి పై స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై త్వరలోనే నిర్ణయం వస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను భారతీయ జనతా పార్టీ అధిష్ఠానానికి గతంలోనే వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి మేలు జరగాలని అందరం కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. హోదా కోసం తమ ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. రాష్ట్రప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళుతున్నామని చెప్పారు.