: నయీమ్ కేసులో సోమన్న అరెస్టు
ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు దర్యాప్తులో భాగంగా సోమన్నను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈసీఐఎల్ ద్వారకానగర్ లో ఇతనిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న శేషన్నకు సోమన్న ప్రధాన అనుచరుడు. కాగా, నల్గొండ జిల్లా భువనగిరిలో నయీమ్ అనుచరుడు పాశం శ్రీనును సిట్ పోలీసులు విచారిస్తున్నారు. పాశం శ్రీను ఇచ్చిన సమాచారంతో భువనగిరిలోని సంబంధిత వ్యాపారులను సిట్ విచారిస్తోంది.