: హిందూ నేత తలకు వెలకట్టిన జామా మసీదు ఇమాం అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు!


గతంలో హిందూ మహాసభ నేత కమ్లేశ్ తివారీపై ఫత్వా జారీ చేసి, అతని తలకు 51 లక్షల రూపాయల వెలకట్టిన జామా మసీదు ఇమామ్ అన్వర్ ఉల్ హక్ ను పోలీసులు అత్యాచార ఆరోపణలతో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లోని జమా మసీద్ ఇమామ్ అన్వర్ ఉల్ హక్‌, అల్లాను ప్రార్థించడం ద్వారా రోగాలు నయం చేస్తానని చెబుతుంటాడు. వీటిని నమ్మి అతని బుట్టలో పడిన తన భార్యను చెరిచాడంటూ ఓ భక్తుడు జామా మసీదు ప్రధాన ఇమామ్ ని కలిసి ఫిర్యాదు చేశాడు. అనంతరం అతనిపై నిఘా వేసిన బాధితురాలి భర్త, పోలీసులు, ప్రధాన ఇమామ్ అనుచరులు కలసి ఆగస్టు 19న దారుణానికి ఒడిగడుతున్న అన్వర్ ఉల్ హక్‌ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News