: సబ్సిడీపై లభించే వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు


నిన్న పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు, సబ్సిడీపై అందిస్తున్న వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్టు నేడు ప్రకటించారు. ఇంటి అవసరాల నిమిత్తం వాడే 14.2 కిలోల సిలిండర్ పై రూ. 2 మేరకు ధర పెంచాలని ఓఎంసీలు నిర్ణయించగా, కేంద్రం దానికి ఆమోదం పలికింది. దీంతో రూ. 423గా ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర రూ. 425కు చేరింది. జూలై నుంచి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం ఇది మూడోసారి. కేంద్ర ఖజానాపై పడుతున్న సబ్సిడీ భారాన్ని నిదానంగా తగ్గించుకునే చర్యల్లో భాగంగా నెలకోసారి స్వల్ప మొత్తంలో ధరలు పెంచుకుంటూ వెళ్లాలని నరేంద్ర మోదీ సర్కారు భావిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జూలై 1 న రూ. 1.98, ఆగస్టు 1న రూ. 1.93 మేరకు ధరలు పెరిగాయి. జూలైలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ, వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం గమనార్హం.

  • Loading...

More Telugu News