: ఒట్టిమాటలు కట్టిపెట్టండి.. గట్టిపనులు చేపట్టండి: హైదరాబాద్ పరిస్థితిపై కిషన్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్ విశ్వనగరం కాదు.. విషాదనగరంలా మారిపోయిందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేత కిషన్‌రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిన్న కురిసిన గంటన్నర వర్షానికే భాగ్యనగరం అస్తవ్యస్తమయిపోయిందని విమర్శించారు. మరో రెండు గంటలు అలాగే వర్షం పడి ఉంటే వందల మంది మృత్యువాత పడేవారని ఆయన అన్నారు. విశ్వనగరం చేస్తామంటూ చెప్పుకుంటోన్న టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌పై తీవ్ర నిర్లక్ష్యధోరణి కనబరుస్తున్నారని ఆయన విమర్శించారు. ‘ఒట్టిమాటలు కట్టిపెట్టండి, గట్టిపనులు చేపట్టండి. హైదరాబాద్ నగరానికీ మీరు ఏమీ చేయలేదు. స్వచ్ఛ హైదరాబాద్ అన్నారు.. స్వచ్ఛ హైదరాబాదో చెత్త హైదరాబాదో.. తెలియడం లేదు. ఎక్కడికెళ్లి చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. వారి పనితీరు మాత్రం ఇలా ఉంది. ప్రభుత్వం హైదరాబాద్ పరిస్థితిపై సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యులు ఎవరు?’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.