: మాకు, ఇతర పార్టీలకు అదే తేడా: సీఎం కేజ్రీవాల్
తమ పార్టీ విలువలకు కట్టుబడి ఉంటుందని.. తమకు, ఇతర పార్టీలకు అదే తేడా అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. సెక్స్ స్కాండల్ ఆరోపణల నేపథ్యంలో మంత్రి సందీప్ కుమార్ ను ఢిల్లీ క్యాబినెట్ నుంచి తొలగించడంపై ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. అవినీతి, అక్రమాలను సహించే ప్రసక్తే లేదని, పార్టీలో ఎవరు అక్రమాలకు పాల్పడినా వేటు తప్పదని హెచ్చరించారు. ఆ నియమం తనకూ వర్తిస్తుందన్నారు. విలువల విషయంలో రాజీపడడం కంటే చనిపోవడానికే ఇష్టపడతానని కేజ్రీవాల్ అన్నారు.