: ఇంకేముంది... చంద్రబాబు తప్పును ఒప్పేసుకున్నట్టే!: వైకాపా


ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ జరిగితే తనకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచనతోనే చంద్రబాబునాయుడు హైకోర్టుకు వెళ్లారని వైకాపా ఆరోపించింది. ఈ మధ్యాహ్నం పార్టీ నేత, ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, తప్పులు చేయలేదని చెప్పుకునే చంద్రబాబుకు, నిజంగా ఓటుకు నోటు కేసులో ప్రమేయం లేకుంటే, విచారణ రద్దు కోరుతూ కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లడం ద్వారా ఆయన తప్పును ఒప్పుకున్నట్లయిందని అన్నారు. పరోక్షంగా తన తప్పును అంగీకరించిన ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గడచిన రెండు రోజులుగా బీజేపీ నేతలు, గవర్నర్ నరసింహన్ తో కేంద్ర మంత్రి సుజనా చౌదరి జరిపిన చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టాలని కూడా ఉమారెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఏసీబీ కోర్టు విచారణను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టులో నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News