: ‘విశాఖ’లోనూ నయీమ్ భూదందాలు!
గ్యాంగ్ స్టర్ నయీమ్ భూ దందాలకు సంబంధించిన రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నయీమ్ పేరిట సూర్యనారాయణ వర్మ అనే వ్యక్తి తనను బెదిరించాడంటూ గొడ్డు భూషణ్ అనే వ్యక్తి విశాఖపట్టణం జిల్లా భీమునిపట్నం (భీమిలి) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన 5 ఎకరాల భూమి ఇవ్వాలంటూ తనను సూర్యనారాయణ వర్మ బెదిరించాడని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖలో భూదందాల వ్యవహారానికి సంబంధించి తన ముఠా సభ్యులతో పాటు నయీమ్ కూడా ఇక్కడికి వచ్చినట్లు సమాచారం.