: చిన్నారిని ఆదుకునేందుకు ఉల్లిపాయలమ్మిన పవన్ కల్యాణ్ అభిమానులు


కేన్సర్ బాధితురాలిని ఆదుకునేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ముందుకొచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా బాడవ గ్రామానికి చెందిన లావణ్య(7) కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. చికిత్సకు రూ.12 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు. దీంతో, కూలీ పనులు చేసుకునే లావణ్య తల్లిదండ్రులు దాతల సాయం కోరారు. ఈ విషయమై స్పందించిన పవన కల్యాణ్ అభిమానులు జిల్లాలోని నరసాపురంలో ఉల్లిపాయలు అమ్మారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు సాయం నిమిత్తం తాము ఉల్లిపాయలు అమ్ముతున్నామని, సాయపడాలంటూ ప్రచారం చేశారు. దీంతో, ఎమ్మెల్యే నుంచి కౌన్సిలర్ వరకు పలువురు ప్రముఖులు ఉల్లిపాయలు కొనుగోలు చేశారు. ఉల్లిపాయలను విక్రయించడం ద్వారా రూ.50 వేల నగదు వచ్చింది. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా రేపు ఈ మొత్తాన్ని కేన్సర్ బాధితురాలు చిన్నారి లావణ్యకు అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News