: ‘మీరిద్దరూ నాకు నటుడిగా జీవితాన్ని ఇచ్చారు’.. వర్మ ట్వీట్‌కి హీరో సుమంత్ రీట్వీట్
ఎవరికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఇటీవలే పుట్టిన రోజు జరుపుకున్న హీరో నాగార్జునకి బర్త్ డే విషెస్ చెప్పారు. నాగార్జున నటించిన సూపర్‌హిట్ మూవీ ‘శివ’ సినిమాతోనే వర్శ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇటీవల ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెబుతూ.. ‘నేను సాధారణంగా ఎవరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పను.. కానీ నాకు డైరెక్టర్‌గా జీవితాన్నిచ్చిన నాగార్జునకు మాత్రం నా రూల్స్ నుంచి మినహాయింపు’ అని వర్మ పేర్కొన్నాడు. అయితే వర్మ ట్వీట్‌పై నాగార్జున మేనల్లుడు, తెలుగు సినీ కథానాయకుడు సుమంత్ రీట్వీట్ చేశారు. వర్మ, నాగార్జున ఇరువురు తనకు నటుడిగా జీవితాన్నిచ్చారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. ఆయన కథానాయకుడిగా 1999లో రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ‘ప్రేమ కథ’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జునే ఈ సినిమాకి నిర్మాత.