: ముఖేష్ అంబానీ ప్రసంగంతో రూ. 12 వేల కోట్లు నష్టపోయిన ఐడియా, ఎయిర్ టెల్


రిలయన్స్ జియోను పరిచయం చేస్తూ, తామందించే వివిధ ప్యాకేజీల గురించిన వివరాలను ముఖేష్ అంబానీ వెల్లడిస్తున్న వేళ, ఐడియా సెల్యులార్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు రూ. 12 వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ను కోల్పోయాయి. ఈ రెండు కంపెనీల ఈక్విటీ వాటా విలువ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో 9 శాతం వరకూ దిగజారింది. ఆపై భారతీ ఎయిర్ టెల్ కొద్దిగా నిలదొక్కుకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐడియా 9.58 శాతం నష్టంతో రూ. 84.50 వద్ద, భారతీ ఎయిర్ టెల్ 6.30 శాతం నష్టంతో రూ. 310.75 వద్దా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లు 0.2 శాతం లాభాల్లో కొనసాగుతుండగా, నేటి సెషన్ లో అత్యధికంగా నష్టపోయిన టాప్-2 కంపెనీల్లో ఐడియా, ఎయిర్ టెల్ నిలిచాయి.

  • Loading...

More Telugu News