: ఆసుపత్రి నుంచి జయేంద్ర సరస్వతి డిశ్చార్జీ!... బెజవాడ నుంచి కంచి పీఠానికి పయనం!
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆరోగ్యం కుదుటపడింది. మూడు రోజుల క్రితం విజయవాడ వచ్చిన సందర్భంగా శ్వాసకోశ సమస్యలతో సతమతమైన జయేంద్రను ఆయన శిష్యులు నగరంలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు రోజుల పాటు వైద్యులు ఆయనకు చికిత్స అందించగా... నిన్న సాయంత్రానికి గాని ఆయన ఆరోగ్యం కాస్తంత మెరుగుపడలేదు. నేటి ఉదయం మరింత మెరుగైన ఆరోగ్యంతో కనిపించిన జయేంద్రను వైద్యులు డిశ్చార్జీ చేశారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన జయేంద్ర కొద్దిసేపటి క్రితం కంచి పీఠానికి బయలుదేరారు.