: ఐటి ఉద్యోగుల వెంట పడుతున్న నేతలు
కర్ణాటక రాష్ట్రంలో కొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం నేతలు ఐటి ఉద్యోగుల వెంట పడుతున్నారు. వారిని మురిపించి ఓట్లు కొట్టేయడానికి తహతహలాడుతున్నారు. దేశంలో మూడింట ఒక వంతు ఐటి ఉద్యోగులు కర్ణాటకలోనే ఉన్నారు. వీరిలోనూ ఎక్కువ శాతం బెంగళూరు నగరంలోనే ఉన్నారు. సుమారుగా 50లక్షల వరకూ ఐటి ఉద్యోగులు ఉంటారని అంచనా. మరి ఇన్ని ఓట్లంటే మామూలు విషయం కాదు కదా? గెలుపులో చాలా కీలకం అవుతాయి. అందుకే నేతలు ఏవేవో హామీలతో ఐటి ఉద్యోగుల ఓట్లను గెలుచుకునేందుకు శ్రమిస్తున్నారు.