: ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టుకు వెళ్లడంలో అర్థం లేదు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం తమపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన ఓటుకు నోటు అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసుల విషయంలో అసలు ఏసీబీ న్యాయస్థానానికి వెళ్లడంలో అర్థం లేదని ఆయన అన్నారు. ఈ కేసు ప్రాతిపదికే చెల్లదని హైకోర్టు ఇదివరకే చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో ప్రతిపక్ష వైసీపీ నేతలు అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాము రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే, వైసీపీ నేతలు కేసులు వేసి అభివృద్ధి పనులను వెనక్కు లాగాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.