: ముఖేష్ అంబానీ '4జీ' దెబ్బకు కుదేలైన ఎయిర్ టెల్, ఐడియా!


ఓ వైపు ముఖేష్ అంబానీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ, రిలయన్స్ జియోపై మాట్లాడుతున్న వేళ, పోటీ సంస్థలైన భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ ఈక్విటీ వాటాల విలువ పాతాళానికి పడిపోయింది. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారతీ ఎయిర్ టెల్ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 6.71 శాతం తగ్గి రూ. 309కి చేరింది. మొత్తం 61 లక్షల ఈక్విటీ వాటాలు చేతులు మారాయి. ఇదే సమయంలో ఐడియా సెల్యులార్ ఈక్విటీ విలువ 7.06 తగ్గి రూ. 86 వద్ద కొనసాగుతోంది. 1.23 కోట్ల వాటాలు చేతులు మారాయి. రిలయన్స్ ప్రకటించిన ఉచిత ఆఫర్లు స్మార్ట్ ఫోన్ యూజర్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చన్న నిపుణుల అంచనాలతోనే ఈ కంపెనీల వాటాలను ఇన్వెస్టర్లు అమ్మి వేసేందుకు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News