: పులిచింతల ముంపు బాధితుల అంశంపై చంద్రబాబుకి గుత్తా సుఖేందర్‌రెడ్డి లేఖ
పులిచింతల ముంపు బాధితుల అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి టీఆర్ఎస్ నేత, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి లేఖ రాశారు. ఆ పాజెక్టులో ముంపు బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరగా పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. రూ.115 కోట్ల పరిహారం చెల్లించాలని ఆయన లేఖ ద్వారా తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 3 ఎత్తిపోతల పథకాలకు మరో రూ.48 కోట్లు పరిహారం ఇవ్వాలని ఆ లేఖలో ఆయన రాశారు.