: ‘ఉచిత’ మంత్రాన్ని పఠించిన ముఖేశ్!... ఎన్నికల హామీలను తలపించిన జియో ఆఫర్లు!
నిజమే... ముంబైలో కొద్దిసేపటి క్రితం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం ఎన్నికల ప్రచార సభనే తలపించింది. మొబైల్ రంగంలో ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన ‘రిలయన్స్ జియో’కు అధికారికంగా రిబ్బన్ కట్ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ‘ఉచిత’ మంత్రం పఠించారు. ఈ నెల 5 నుంచి జియో సేవలను అధికారికంగా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 5 నుంచి డిసెంబర్ వరకు జియో మొబైల్ సేవలను ఉచితంగానే ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక రూ.50 లకే 1 జీబీ డేటాను అందించనున్నట్లు పేర్కొన్న ఆయన... విద్యార్థులకు మరో 25 శాతం అధికంగా డేటాను అందిస్తామన్నారు. వెరసి రిలయన్స్ సర్వసభ్వ సమావేశం సాంతం ఎన్నికల సందర్భంగా వరాలిచ్చే రాజకీయ పార్టీల సభలను తలపించింది.