: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి, ఉత్తర కోస్తాంధ్ర సమీప ప్రాంతాల్లో కొనసాగుతోందని తెలిపారు. 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వీటి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.